UPDATES  

 సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కొండంత అండగా నిలిచారు

సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కొండంత అండగా నిలిచారు

*పింఛన్ల పంపిణీలో దేశంలోనే అగ్రగామి తెలంగాణ
* దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించవచ్చు

*దివ్యాంగులకు నెలకు రూ.4016 అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే
* 3,287దివ్యాంగులకు పెంచిన పింఛన్ పత్రాలను అందజేసిన విప్, ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్,మణుగూరు:సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కొండంత అండగా నిలిచారని విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం
మణుగూరు మండలం లోని కిన్నెర కళ్యాణ మండపంలో 3287 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే రేగా అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ…
నియోజకవర్గ పరిధిలోని ఆళ్లపల్లి 160, అశ్వాపురం 721, బూర్గంపాడు 786, గుండాల 215, కరకగూడెం 238, మణుగూరు మండలం 380, మణుగూరు మున్సిపాలిటీ 376, పినపాక 411, మండలాలకు సంబంధించి మొత్తం 3287 లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలోనే ఎవరి ఊహించని రీతిలో అన్ని రంగాల రూపు రేఖలు మార్చుకొని అభివృద్ధిలో ముందున్నామని అందుకే సంక్షేమ పథకాలు అంచనంచెలుగా పెంచుకుంటూ ఆర్థికంగా ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్నదని ఆయన అన్నారు, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంద అన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016 అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు…

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలు నివ్వెరపోయేలా ఉన్నాయని అన్నారు కలలో కూడా ఊహించని అభివృద్ధిని సీఎం కేసీఆర్ గారు చేసి చూపిస్తున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల దివ్యాంగ పింఛన్ దారులు, బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !