వేగంగా పనులు జరుగాలే
* పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్,మణుగూరు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో
పినపాక నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మణుగూరు డివిజన్ పంచాయతీరాజ్ డిఇ సైదులు రెడ్డి, ఏఈఈ రెనాల్ట్ ల తో ప్రత్యేక సమావేశమై నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎక్కడ అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. చేసే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేసే విధంగా చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దండిగా నిధులు ఇవ్వడం జరిగిందని అన్ని శాఖలు సమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు . అధికారులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా వారికి అభయమిచ్చారు.
