భక్తిశ్రద్దలతో వరలక్ష్మి వ్రతం పూజలు…
శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి…
మన్యం న్యూస్ చండ్రుగొండ,ఆగస్టు25: శ్రావణమాసం సందర్భంగా తొలి శుక్రవారం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. చండ్రుగొండలోని మహలక్ష్మి ఆలయంలో వేదపండితులు వివిఆర్ కె మూర్తి ఆద్వర్యంలో మహిళలు కుంకుమ పూజులు చేశారు. శుక్రవారం తెల్లవారుఝామున నుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మహలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ చైర్మన్ చీదెళ్ల పవన్ కుమార్ ఆద్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.