UPDATES  

 కాంగ్రెస్ ఖల్లాస్

కాంగ్రెస్ ఖల్లాస్
*బీ. ఆర్. ఎస్ లో చేరినకాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల ప్రభాకర్ రావు
* అభివృద్ధి సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలనకు తిరుగులేదు
* టికెట్ల కోసం కోట్టుకునేటోళ్లు ప్రజలకు ఏం సేవ చేస్తారు
*పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్,బూర్గంపాడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖలాస్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ. ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు.
మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో మండలం లోని సోంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గండ్రగొడ్డపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు . ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కొట్లాడే ఎక్కువగా జరుగుతుందని టికెట్ల మీద ఉన్న సోయి ప్రజల మీద లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమం అభివృద్ధి ముందు కాంగ్రెస్ పార్టీ ఖలాస్ అవడం ఖాయమని ఆయన ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ విజన్ తో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా ముందుకు సాగుతుందని, మరోమారు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పినపాక నియోజకవర్గానికిప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి తన నినాదం అని రానున్న ఎలక్షన్ లో మరో మారు ఆశీర్వదించాలని ఆయన పినపాక నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !