పెంచిన దివ్యాంగుల సొమ్ము ఖాతాలలో జమ
ఇటీవలే రూ.4వేల 16 లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
* మా పాలిట దేవుడు సీఎం కేసీఆర్: దివ్యాంగ పింఛన్ దారులు
దివ్యాంగులకు అండదండ కెసిఆర్ ప్రభుత్వం: విప్,పినపాక ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్ గుండాల: పెరిగిన ఆసరా పెన్షన్ వచ్చి దివ్యాంగులకు ఆనందాన్ని తెచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు మూడు వేల రూపాయల నుండి రూ.4016 పెన్షన్ పెంచడంతో ఒక్కసారిగా దివ్యాంగులు సంతోషంలో మునిగిపోయారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.4016 పింఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ ఏర్పడక ముందు కేవలం రూ200 పెన్షన్ మాత్రమే రాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా వెయ్యి రూపాయలు,అనంతరం రూ 3 వేలు నేడు రూ4 వేలు పెంచడంతో వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ సభలో పెంచిన పెన్షన్ ప్రకటించిన వెంటనే దివ్యాంగుల ఖాతాల్లో జమ కావడంతో ఒక్కసారిగా వారు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగులను గుర్తించి వారికి అండగా నిలవకపోవడంతో వారు గతంలో నిస్సాయ స్థితిలో ఉండేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులను ఆదుకోవాలని దృఢ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి బాసటగా నిలుస్తుంది. తాము పింఛన్ తీసుకున్నప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ముందు కనబడుతున్నారని లబ్ధిదారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు.
సంక్షేమం అందించడంలో కెసిఆర్ కు సాటిఎవరు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు: దేశంలో సంక్షేమం అందించడంలో కేసీఆర్ కు సాటి ఎవరు అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు రూ4016 పెన్షన్ను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
పెన్షన్ తీసుకున్నప్పుడల్లా కేసీఆర్ కనబడతారు పాలకుర్తి ఉపేందర్: ప్రతినెల పెన్షన్ తీసుకున్నప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కనపడతారని గుండాల మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి ఉపేందర్ పేర్కొన్నారు. గతంలో 3016 రూపాయలు వచ్చే పెన్షన్ ఈనెల 4016 రావడంతో ఆనందంగా ఉందన్నారు.
ఆసరా పెన్షన్ పెరగడం ఆనందంగా ఉంది శంకర్: ఆసరా పెన్షన్ ఈ నెల నుండి రూ4016 రూపాయలు పెరగడం ఎంతో ఆనందంగా ఉందని ముత్తాపురం గ్రామానికి చెందిన శంకర్ పేర్కొన్నారు. ప్రతినెల పెన్షన్ రావడంతో కొండంత ఆసరాగా ఉంటుందని ఆయన అన్నారు.
