UPDATES  

 ఊరూరా కోటి మొక్కలు నాటే సంబరాలు.

  • ఊరూరా కోటి మొక్కలు నాటే సంబరాలు.
  • దూలాపురం వాజేడు ఫారెస్ట్ రేంజ్ లలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు అధికారులు

    మన్యం న్యూస్ వాజేడు

కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలం లో అన్ని గ్రామ పంచాయతీల పరిధి లో పాఠశాలలు, ఇతర ప్రభుత్వ స్థలాలు,రహదారులు , గ్రామపంచాయతీలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని, వాజేడు మండలం దూల పురం, వాజేడు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పంచాయతీలలో ,గ్రామీణ ఉపాధి హామీ పథకం, మండల పరిషత్, పంచాయతీరాజ్, ఫారెస్ట్,రెవెన్యూ , విద్యాశాఖ, విద్యార్థులు అనేక ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకొని, జాతీయ జెండాలను చేతబూని మొక్కలు నాటే ఉద్యమాన్ని ఆనందోత్సహాల మద్య ఉత్సవం గా ,పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు , మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ, అవగాహన కల్పించారు. నీడ నిచ్చేమరియు పళ్ళు ,పూలమొక్కలు ఇతర వృక్షాల మొక్కలను ఈ సందర్భంగా కోటి మొక్కల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమం లో విద్యార్థుల సైతం భాగస్వాము లయ్యారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అధికార యంత్రాంగం, మొక్కలను ప్రతి గృహస్తులు, ప్రజలు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రభుత్వ ఉద్యమంగా కాకుండా, మన ఊరు మన ప్రగతి, మన పర్యావరణం అని భవిష్యత్తు తరాలకు కోటి మొక్కల ప్రణాళికలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మండల అధికారులు,అదికార యంత్రాంగం పిలుపునిచ్చారు. మొక్కలను నాటే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కోటి వృక్షార్చన భాగంగా అయ్యవారిపేట,నుండి 1000 మొక్కలను ధర్మవరం, నుండి1000మొక్కలను పంచాయతీలో రకాల పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను నాటేలా సన్నహాలు చేస్తున్నారు.కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కావాల్సిన మొక్కలను అందుబాటులో ఉంచారు. ప్రతీ పంచాయతీలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగిందని తెలిపారు. వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటడమే కాక సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నారాయణ, బీట్ ఆఫీసర్ హరిప్రసాద్ వర్మ, అయ్యవారిపేట సర్పంచ్ మడకం బేనిని, ఉప సర్పంచ్ పలిశెట్టి శ్రీనివాస్, అయ్యవారిపేట పంచాయతీ సెక్రెటరీ అశోక్, ధర్మవరం పంచాయతీ సెక్రెటరీ నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ అబ్బు శీను,గ్రామస్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !