మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి చేసుకునేందుకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు. శనివారం అధికారులందరితో భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. సెక్టార్ల వారిగా అధికారులను కేటాయించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.