UPDATES  

 బిజెపి సభ గ్రాండ్ సక్సెస్

బిజెపి సభ గ్రాండ్ సక్సెస్
* కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపిన అమిత్ షా ప్రసంగం
* విలేకరుల సమావేశంలో కె.వి.రంగా కిరణ్

మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
ఖమ్మం పట్టణంలో జరిగిన బిజెపి సభ గ్రాండ్ సక్సెస్ అయిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సంఘ సేవకుడు కె.వి రంగా కిరణ్ అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి సభకు సుమారు 80 వేలమంది రావడం జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ సభతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపికి మరింత బలం చేకూరిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అధిక నిధులు కేటాయిస్తున్న ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమి నిధులు ఇవ్వడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలోని సెంట్రల్ లైటింగ్ కు కేంద్రమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా వైకుంఠధామాలకు కూడా నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో బిజెపికి అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఇంకా అనేకమంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ ఎదుగుదలను ఎవరు అడ్డుకోలేరని కె.వి రంగా కిరణ్ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు నాగేశ్వరరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాస్, ఓబీసీ కోశాధికారి జల్లారపు రమేష్, నాయకులు గాంధీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !