భద్రాచలంపై బీజేపీ ది సవతి తల్లి ప్రేమ
* ఆంధ్రాలో అన్యాయంగా కలిపిన 5 మండలాల సంగతేంటి?
* కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై నిప్పులు చేరిగిన విప్ రేగా కాంతరావు
మన్యం న్యూస్: భద్రాచలంపై బిజెపిది సవతి తల్లి ప్రేమని బి ఆర్ ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో అన్యాయంగా కలిపిన 5 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపే దమ్ముందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రామ భూముల రక్షణపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు బిజెపి చేసింది ఏం లేదన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం సాధిస్తామనే పగటి కలలు బిజెపి మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమం అందని గడపలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్నారు.
