ఏజెన్సీ బాంధవుడు ఎమ్మెల్యే రేగాను ఆశీర్వదించు తల్లి
కోట మైసమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ మండల నాయకులు
మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మరో మారు పినపాక అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో గుండాల మండల నాయకులు కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ తల్లిని ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్య సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి మాట్లాడుతూ. ప్రభుత్వ విప్ రేగా కాంతారావును పినపాక నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వంలో మంత్రిగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అందులో భాగంగానే కోట మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశామని అన్నారు. ఆ తల్లి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే రేగా మంత్రి కావడం ఖాయం అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది రేగా కాంతారావు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి వట్టం రవి, ఆ బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, నియోజకవర్గ నాయకులు శీలం మహేందర్, మండల నాయకులు కొర్స లాలయ్య, చుక్క వీరన్న, జనగాం లక్ష్మయ్య, రామకృష్ణ , సతీష్, కల్తీ సుధాకర్, కృష్ణమూర్తి
