UPDATES  

 ధూంధాంగా “బోనాల జాతర” సందడి

ధూంధాంగా “బోనాల జాతర” సందడి
* ఆకట్టుకున్న విచిత్ర వేషధారణ
* రోడ్డు పొడుగునా మహిళలు నృత్యాలు
* పోచమ్మను దర్శించుకున్న భక్తులు ప్రజలు
* సందడిగా మారిన సూపర్ బజార్ గణేష్ టెంపుల్ ఏరియా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రావణమాసం బోనాల జాతర పండుగ ధూంధాంగా జరిగింది.
బోనాల జాతర సందర్భంగా పోచమ్మ తల్లిని రోడ్డు పొడవున ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తా నుండి సూపర్ బజార్ ఎంజీ రోడ్ గణేష్ టెంపుల్ ఏరియా పాత బస్ డిపో లక్ష్మీదేవిపల్లి మండలం ఏరియా మీదుగా సింగరేణి ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పోచమ్మ తల్లి గుడి వరకు కొనసాగింది. అనంతరం పోచమ్మ తల్లికి మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. అదేవిధంగా భక్తులు ప్రజలు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు. అంతేకాకుండా రోడ్డు పొడవునా పలువురు విచిత్ర వేషధారణలతో నృత్యాలు చేశారు. డ్యాన్సులతో ప్రధాన సెంటర్లు సందడిగా మారిపోవడంతో పాటు నృత్యాలను చూసిన పలువురు మురిసి మైమరిచిపోయారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని)తో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పోచమ్మ తల్లికి పూజలు…
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 35 వార్డులో ఉన్న పోచమ్మ తల్లికి భక్తులు మహిళలు పూజలు చేసి బోనాల సమర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బండారి దంపతులు, కొండయ్య, రాజు, రజినీకాంత్ బండారి, సశి ,శివ మహిళలు రూప సృజన, వరలక్ష్మి, సౌజన్య, బస్తి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !