UPDATES  

 కుల వృత్తులకు బీసీ బంధు భరోసా.

  • బంధు లు వచ్చే..బడుగుల జీవితాల్లో వెలుగులు నింపే..
  • కుల వృత్తులకు బీసీ బంధు భరోసా.
  • దళితులకు దళిత బంధు పథకం ‘ఓ’ మహాయజ్ఞం.

మన్యం న్యూస్ ,బూర్గంపాడు:- తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో సంక్షేమ పథకాల పండుగ జరుగుతుంది. ఒకనాడు సమాజానికి దూరంగా ఉంటూ ఆర్థిక అసమానతలు ఎదుర్కొన్న దళిత కుటుంబాలు నేడు దళిత బంధు పథకంతో సగర్వంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. తాత ముత్తాతల కాలం నుండి వారసత్వంగా కష్టాలు, ఆకలి కేకలు దళిత బంధు పథకం తో వారి రూపురేఖలు మార్చేశాయి. బిసి బంధు, మైనార్టీ బంధు పథకాలతో సొంత యూనిట్లను ఏర్పాటు చేసికొని ఏలనాటి ఆర్థిక కష్టాలకు ముగింపు పలుకుతున్నారు.మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.
కులవృత్తులకు బిసి బంధు భరోసా.
రాష్ట్రంలో ఉన్న కుల,చేతి వృత్తిదారుల జీవితాలలో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసాను కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘బీసీ బంధు’ అనే నూతన సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది.ఈ పథకం ద్వారా వచ్చే లక్ష రూపాయల ఆర్థిక సాయంతో ఆయా చేతి వృత్తుల కుటుంబాల్లో భరోసా అవకాశం ఉంటుంది.ఈ పథకం మొదటి విడత చెక్కులు పంపిణీతో మండలంలో బీసీ కులాలకు చెందిన పెద్ద మొత్తంలో కుల వృత్తులు పలు పార్టీల నుండి కుడా ఈ పార్టీలోకి అడుగులేస్తున్నారు,బిఆర్ఎస్ పార్టీ లోకి ఈ పథకం ఇంకా ఆకర్షణీతులను చేస్తున్నది.ఇగ రెండో విడతకు రంగం సిద్ధం అవుతున్నది దీంతో పలు పార్టీలో ఉన్న కార్యకర్తలు సైతం,నాయకులు సైతం ఆకర్షనీయులయి బిఆర్ఎస్ పార్టీలో అడుగులేసేందుకు ముందుకు వస్తున్నారు.ఈ పథకం ఒకటి రెండు విడతలుగానే పరిమితం కాదని ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతుంది అని పలు సందర్బాల్లో గులాబీ బాస్ వెల్లడించారు.
దళిత బంధు పథకం ‘ఓ’మహా యజ్ఞం.
తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది ఇప్పటికే మొదటి విడుత పంపకాలు జరగగా రెండో విడత పంపకాలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై,ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.పరిశ్రమలను,ఉపాధిని,వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడం కోసం ఈ పథకం ప్రజలకు ఓ వరం అని,ఇది రాష్ట్రంలో ఓ మహా యజ్ఞంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.
రెండో విడత దళిత బంధుకి రంగం సిద్ధం.
రెండో విడతలో రాష్ట్రంలో లక్షా ముప్పై వేల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కే.చంద్రశేఖరరావు లబ్ధి చేకూర్చనున్నారు.రెండో విడతలో కూడా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 1100 మందిని దళిత బంధు పథకానికి ఎంపిక చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.మెుుత్తం 1,29,800 మందికి దళిత బంధు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే,ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలివ్వగా ఈ పథకం రెందోవిడత సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నట్టు విస్వానియత సమాచారం.ఈ పథకం కుడా నిరంతరాయంగా కొనసాగుతుంది అని పలు సందర్బాల్లో గులాబీ బాస్ వెల్లడించారు పలు కార్యక్రమ సందర్బాల్లో పాల్గొన్న పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతరావు మాట్లాడుతూ నియోజకవర్గ పేద,దళిత కుటుంబాల సంక్షేమానికి,పేదరికం నిర్మూలనకు నిరంతరంగా పాటు పడతానని తెలియజేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !