UPDATES  

 గొండ్వన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సోంది వీరయ్యకు అనారోగ్యం

గొండ్వన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సోంది వీరయ్యకు అనారోగ్యం
*విషమంగా ఆరోగ్యం, హైదరాబాద్ కు తరలింపు
*దాతల సహాయం కొరకు ఎదురు చూపు
మన్యం న్యూస్, చర్ల:
ఆదివాసి ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గొండ్వన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సోంది వీరయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో భద్రాచలం హాస్పిటల్ లో చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. గోండ్వానా సంక్షేమ పరిషత్ కన్వీనర్ ఇరుప ప్రకాష్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల చట్టాల పరిరక్షణకై సుదీర్ఘంగా సుమారు 50 సంవత్సరాలు నుంచి అలుపెరుగని పోరాటం చేసి, ఆదివాసులు కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 ను తీసుకురావడం కోసం ప్రభుత్వంతో పోరాడిన ఉద్యమ నేత, ఎందరో ఆదివాసులకు షెడ్యూల్ ప్రాంతంలో 100% రిజర్వేషన్ ఇప్పించుటకు ముఖ్య కారకుడు, పోలవరం ప్రాజెక్టు వలన గిరిజనులు తమ నివసించే నివాసము కూడు గుడ్డు తిండి కోల్పోతామని తన సారధ్యంలో ఉద్యమం చేసిన ఆదివాసి ఉద్యమ నేత సొంది వీరయ్య. అలాంటి నేత ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించారు. వైద్యానికి డబ్బులు లేక ఏమి పాలు పోలేని స్థితిలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరయ్య పోరాటాల మూలంగా లబ్ధి పొంది చాలామంది ఉన్నతమైన స్థానాలలో స్థిరపడ్డారు. ఆదివాసుల కోసం పోరాటం చేసిన మన ఉద్యమ నేతను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మానవత్వంతో అన్ని వర్గాల ప్రజలు, ఆదివాసి నాయకులు ,దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందించి వీరయ్య వైద్య ఖర్చులకు సహకరించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !