మన్యం న్యూస్,అశ్వాపురం: మండల పరిధి గొల్లగూడెం గ్రామ నివాసి మండల బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఏర్పుల నరేష్ సతీమణి ఏర్పుల లావణ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకొని మృతురాలి స్వగృహమునకు వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సూదిరెడ్డి గోపి రెడ్డి,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,గొల్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు పసుల శివ కృష్ణ,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీమ్,మండల యువజన విభాగం ఉప అధ్యక్షులు రాసాల రమేష్,అశ్వాపురం గ్రామ శాఖ అధ్యక్షులు జూపెల్లి కిరణ్,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,రావుల అజయ్, జావీద్,మడిపల్లి రమేష్,జెన్నీ రాజశేఖర్,రాయపూడి అశోక్,మందా రాంబాబు,లకావత్ సాయి,మడిపల్లి ప్రశాంత్,కరకాపల్లి డేవిడ్,నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.