ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి
తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ
మన్యం న్యూస్,ఇల్లందు:తెదేపా రాష్ట్ర అద్యక్షలు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు అధికార భారాసా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయడంలో వైఫల్యాలను నిరసిస్తూ తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అందుబాటులో లేని కారణంగా సీనియర్ అసిస్టెంట్ కు మంగళవారం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్షరుపాయల పంట రుణమాఫీ సకాలంలో చెయకపోవటం వలన వడ్డీపెరిగి రైతులకు మెయలేని బారం అయిందని వెంటనే వడ్డీతో లక్షరుపాయలు రుణమాఫీ చెయాలని తెలిపారు. నిరుద్యోగ భృతి 3016 రూపాయలు వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాలని, దళితులకు మూడుఎకరాల భూమి పంపిణీ, దళిత, గిరిజన, మైనారటీ, బీసీబందులు ఇవ్వాలని అన్నారు. ఖాళీస్థలం ఉన్న పేదవారికి ఇంటినిర్మాణం కోరకు ఐదులక్షల రూపాయలు ఇవ్వాలని
ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాటి ఎన్నికల్లో భారాసా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలుచేసి ప్రజలకు అండగా ఉండాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళనాలు చేస్తామని ముద్రగడ వంశీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ తీవారి, కారు నర్సయ్య, దేశవత్ శ్రీహరి, కంది రవి, శిల్ప వెంకటేశ్వర్లు, పట్టణ కమిటీనాయకులు గోరెంట్ల రామయ్య, మామిడాల భాస్కరావు, జానీ, శ్యామ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.