- మట్టి వినాయక విగ్రహాలు వాడుదాం పర్యావరణాన్ని రక్షించుకుందాం
- మట్టివిగ్రహాలు పెట్టినవారికి పురపాలకసంఘం తరఫున ప్రోత్సాహక బహుమతులు ప్రకటిస్తాం
- మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు
మన్యం న్యూస్,ఇల్లందు:పర్యావరణ పరిరక్షణకు మట్టివిగ్రహాలు ఎంతో మేలుచేస్తాయని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మంగళవారం పత్రికాప్రకటన విడుదల చేశారు. ఇల్లందు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగే వినాయకచవితి ఉత్సవాలు దగ్గరికి వస్తున్న తరుణంలో వినాయకచవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు సబ్బండవర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసే విగ్రహాల వల్ల ఏర్పడే కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మట్టి గణపతులను పూజించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినవారమవుతామని తెలిపారు. మట్టివిగ్రహాలు పెట్టి పూజించిన వారికి ఇల్లందు పురపాలకసంఘం తరఫున ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తామని డీవీ తెలియజేశారు.