తెల్లం వెంకట్రావు సుడిగాలి పర్యటన
ఘన స్వాగతం పలికిన బీ. ఆర్ .ఎస్ పార్టీ శ్రేణులు
మన్యం న్యూస్ చర్ల
భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించిన తర్వాత తొలిసారి చర్లకు వచ్చిన తెల్లం కు మండల బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.అనంతరం పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించి తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి గ్రామంలో వివరించాలని గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునారాకృతం కాకుండా గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా శ్రమించి ఈసారి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉండి భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండటం వల్ల నియోజకవర్గ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని తెలిపారు.తరువాత బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సోయం రాజారావు మాట్లాడుతూ కొంతమంది వివిధ పార్టీల నాయకులు కావాలని తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని త్వరలోనే అలాంటి వారికి బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయన్నారు. అనంతరం ముఖ్య పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు.