మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని జానంపేట లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 29న హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటామని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ విద్యార్థులకు తెలియజేశారు. చదువుతోపాటు ఆటలలో కూడా మంచి ప్రతిభ కనబరిచిన వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు