UPDATES  

 బ్రిలియంట్ హై స్కూల్ లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు.

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మండల పరిధిలోని సారపాక బ్రిలియంట్ హై స్కూల్ నందు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవ వేడుకను బ్రిలియంట్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష ప్రాముఖ్యత పై వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించారు,ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బి ఎన్ ఆర్ గారు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు ప్రధానం చేశారు.అనంతరం తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకొని బ్రిలియంట్ విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ కుమారి మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ మన మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకున్న మన అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషను గౌరవించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు.బ్రిలియంట్ విద్యా సంస్థల తరపున తెలుగు ఉపాధ్యాయురాలిని శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ కుమారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !