మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 29: ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవావం మరియు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అశ్వారావుపేటలోని స్థానిక మైనారిటీ బీసీ గురుకులం పాటశాల నందు జరిగిన కార్యక్రమంలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు మానసిక ఆనందాన్ని కలిగిస్తుందనీ అలాగే ఆరోగ్యపరంగా మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయని, ప్రతి ఒక్కరికీ అన్ని రంగాలలో ఉండాలని, క్రీడా రంగాలలో పాల్గొని మంచి స్థాయికి చేరి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్బంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. అలాగే క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన క్రీడాకారులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు దూపాకుంట్ల దుర్గారావు, వాసవి క్లబ్ అధ్యక్షులు శీమకుర్తి సుబ్బారావు, గౌతమి స్కూల్ ప్రిన్సిపాల్ చలపతిరావు, కంచర్ల రామారావు, పుల్లారావు, బ్రహ్మారావు, మోహన్ రావు, మైనారిటీ బీసీ బాయ్స్ పాటశాల ప్రధానిపాధ్యాయులు మంజులా పాటశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.