ఇల్లందు డిపో ప్రారంభం
గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని పల్లెలకు పరుగు పెట్టనున్న ఆర్టీసీ బస్సులు
*రహదారి వేస్తా ఆర్టీసీ బస్సు తీసుకువస్తా
ఎన్నికల హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే రేగా*
మన్యం న్యూస్ గుండాల: ఇల్లందు ఆర్టీసీ మినీ డిపో ఓపెన్ కావడంతో గుండాల, ఆళ్లపల్లి మండలాలలోని ఆదివాసీగిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు లు త్వరలోనే పరుగులు పెట్టనుంది. రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించడంతో ల్లందు డిపో కళ నెరవేరింది.ఇటీవలే ఇల్లందు డిపోను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చేతుల మీదుగా డిపో ప్రారంభమైంది. దీనితో గుండాల, ఆళ్లపల్లి మండలాలకు ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు పెద్ద ఎత్తున నడవనున్నాయి. గుండాల మండలంలోని శెట్టిపల్లి మీదుగా గుండాల వరకు దామరతోగు వరకు కూడా ఆర్టీసీ సర్వీసులను నడపవచ్చు. గుండాల, లింగగూడెం, నరసాపురం మీదుగా మళ్లీ గుండాల వచ్చి ఇల్లందు వెళ్లే విధంగా కూడా సౌకర్యవంతంగా రహదారులు ఉన్నాయి. మండలంలో అంతర్గతంగా ఉన్న పల్లెలకు ఆర్టీసీ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది అవి కూడా సరైన సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. మినీ డిపో ఏర్పాటు కావడంతో గుండాల, ఆళ్లపల్లి మండలాల పల్లెల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
రహదారివేసి ఆర్టిసి బస్సులో వస్తానని హామీ ఇచ్చా దాన్ని నెరవేరుస్తా ప్రభుత్వ విప్ రేగా: కొమరారం నుండి చెట్టుపల్లి వరకు రహదారివేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి శేట్టుపల్లి చేరుకుంటానని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రహదారివేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సైతం చేయడం జరిగింది .మినీ డిపో ఏర్పడిన తర్వాత ఇల్లందు నుండి శేట్టుపల్లి మీదుగా గుండాల కు ఆర్టీసీ సర్వీస్ నడిచే విధంగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండల ప్రజలకు గతంలోహామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి సహకారం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవ, విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలకు ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
