మన్యం న్యూస్, వాజేడు:
మండలంలో సైబర్ క్రైమ్ పై ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని మొట్లగూడెం గ్రామంలో నిర్వహించారు.టెక్నాలజీ ఎంత పెరిగిన అంతకుమించి సైబర్ నేరగాళ్లు పలు ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్ఎంఎస్లు ఇతర సిగ్నల్స్ పంపిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ అజాగ్రత్తగా ఉన్నట్లయితే వారి బ్యాంకు అకౌంట్ల సొత్తు దొంగిలించ బడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని , ఎస్సై వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరుగుతే పోలీస్ శాఖ ను సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్, కానిస్టేబుల్స్ ప్రజలు పాల్గొన్నారు.
