ఆశ వర్కర్లకు రూ18 వేల వేతనం ఇవ్వాలి
*పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి
*ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దుబ్బ ధనలక్ష్మి
మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 29: దమ్మపేట మండలం, ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం అందించి, పనిబారం తగ్గించాలని ఆశ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జిల్లా దుబ్బాక ధనలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మెచ్చా ఇంటి వద్ద తాటి సుబ్బన్న గూడెంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు నిత్యం ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అనేక సేవలందిస్తున్నప్పటికీ ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కారం కావడం లేదనీ, ఆశ కార్యకర్తలకు విపరీతమైన పని బారం పెంచి శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని అన్నారు. ఆశ వర్కర్స్ కు పారితోషికాలు రద్దుచేసి కనీస వేతనం రూ.18000 నిర్ణయించాలని పియఫ్, ఐఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అర్హులైన ఆశా కార్యకర్తలను రెండవ ఏయన్ యమ్ లు గా గుర్తించాలని క్వాలిటీ యూనిఫామ్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ పాల్గొన్నారు.