మన్యం న్యూస్ గుండాల: పాటల యుద్ధ నౌక గద్దర్ అన్న యాది మరువమని ఆదివాసి, సామాజిక సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గద్దర్ అన్న సంతాప సభను నిర్వహించారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడెం వెంకటేశ్వర్లు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు నవజీవన్ సంజీవ్ మాట్లాడుతూ గద్దర్ అన్న ప్రజలను మేల్కొల్పే అనేక గీతాలను రచించి ప్రజలను మేల్కొల్పారని అన్నారు. గద్దర్ తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ అని కొనియాడారు. అలాంటి మహనీయుని ఎన్నటికీ మరువబోమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, కన్నయ్య, ఒక్కటి ప్రవీణ్, రంజిత్ బుజ్జి బాబు, తదితరులు పాల్గొన్నారు.
