- మూడవ సారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గెలుపు కాయం
- మణుగూరులో బీఅర్ఎస్ నాయకుల పాదయాత్ర
- భద్రాద్రి రామయ్య ఆలయం వరకు సాగనున్న పాదయాత్ర
- పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 29
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గెలుపు కోరుతూ,మంగళవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బీఅర్ఎస్ నాయకులు వేర్పుల సురేష్,గంగారపు రమేష్,యాకయ్య,నాగేల్లి గోపి,యాట సుధాకర్, వేర్పుల జీవన్,బేత మళ్ళ సుందర్,గారా విష్ణు,దామర్ల దయాకర్,భద్రాద్రి రామయ్య ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ నాయకులూ మాట్లాడుతూ,త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిచి,అధికారం చేపట్టాలని వారు ఆకాంక్షించారు.విప్ రేగా కాంతారావు ఎమ్మెల్యే గా మూడోసారి విజయఢంకా మోగించి,పినపాక గడ్డ పై గులాబీ జెండా ఎగురవేయాడం కాయం అన్నారు.వారి గెలుపును కాంక్షిస్తూ,భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని వారికీ ఉండాలని పాద యాత్ర చేపట్టామని వారు తెలిపారు.బీఅర్ఎస్ గెలుపు కోసం తామంతా అండగా నిలిచి ప్రభుత్వ పథకాలు గడప గడపకు తీసుకువెళ్ళి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారం లో కి వస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా రేగా కాంతారావు మూడోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలవాలని పాదయాత్రలో నినాదాలు చేశారు.100 పడకల ఆసుపత్రి వరకు సాగిన యాత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కూడా పాల్గొన్నారు.అక్కడి నుంచి నాయకులు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకుని,అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు,పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు,కో ఆప్షన్ జావీద్ పాషా, సర్పంచ్ ఏనిక ప్రసాద్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,యాదగిరి గౌడ్,నియోజకవర్గ నాయకులు నవీన్ బాబు,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,యువజన నాయకులు,అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.