మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులురేగా కాంతారావు చేతుల మీదుగా సీఎం సహాయనిధి చెక్కులను పంపిణి చేశారు.ఈ సందర్బంగా మణుగూరు పట్టణంలోని బాలాజీ నగర్ ఏరియాకు చెందిన జి.కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 18 వేల రూపాయల విలువ గల సీఎం సహాయనిధి చెక్కును పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, విప్ రేగా కాంతారావు,నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్బంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరం అన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి,సీఎం సహాయనిధి చాల ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఆస్పత్రులలో చికిత్సలు చేయించుకుని ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నవీన్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బాబీ జాన్,తాత రమణ,యువజన నాయకులు రవి ప్రసాద్,జాగృతి అధ్యక్షులు పవన్ నాయక్,బిఆర్ఎస్వీ నాయకులు చరణ్ తదితరులు పాల్గొన్నారు.