మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కు పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్[ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,ప్రభుత్వ విప్,రేగా కాంతారావును బిఆర్ఎస్ సెల్ లండన్ మీడియా సెక్రెటరీ కుప్పల.గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.