UPDATES  

 రేగా చొరవ…

రేగా చొరవ…
రామ చంద్రపురంమట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారే గతంలో ఎన్నడూ లేని విధంగా సందు రోడ్లు బాగు సీసీ రోడ్లకే రూ60 లక్షల నిధులు కేటాయింపు
* గత ఎమ్మెల్యే తట్టెడు మట్టి పోయలే
అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేగా కృతజ్ఞతలుతెలిపిన రామచంద్రపురం గ్రామపంచాయతీ ప్రజలు మన్యం న్యూస్, అశ్వాపురం: గత ఎమ్మెల్యే హయాంలో ఆ గ్రామంలో తట్టెడు మట్టి పోయలే. సందు రోడ్లు గుంతల మయంగా మారి గ్రామస్తులు నరకయాతన అనుభవించేవారు. వారి కష్టాలను గత ఎమ్మెల్యేకు పలుమార్లు చెప్పిన పట్టించుకున్నదాఖలాలు లేవు. ఈనేపథ్యంలో అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామస్తులు తమ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విన్నవించుకున్నారు. అడిగిందే తడవుగా లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రామచంద్రపురం గ్రామపంచాయతీపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధి మార్కుపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.
మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో గల 15 మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చిన ఘటన త ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కు దక్కుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు . దాదాపుగా సందు వీధులన్నీ సీసీ రోడ్లుగా మారాయి. తమ గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసిన పినపాక ఎమ్మెల్యే రేగాతాంతారావుకి రామచంద్రాపురం గ్రామస్తులు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రామచంద్రపురం గ్రామపంచాయతీలో గల మట్టి రోడ్లను సైతం రేగా కాంతారావు చొరవతో 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించుకుని సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది.
1.అద్దంకి పాపారావు ఇంటి నుండి శ్యామల నారాయణరెడ్డి ఇంటి వరకు 2.వెంగళ ముత్తారెడ్డి ఇంటి నుండి మిట్టకంటి సాంబిరెడ్డి ఇంటి వరకు 3.మద్ది వెంకటరెడ్డి ఇంటి నుండి అలిపురపు రంగారెడ్డి ఇంటి వరకు 4.సామ సంజీవరెడ్డి ఇంటి నుండి కోమటిరెడ్డి మల్లారెడ్డి ఇంటి వరకు 5.అలిపురపు సాయి రెడ్డి ఇంటి నుండి మిట్టకంటి వెంకట్ రెడ్డి ఇంటి వరకు 6.కొండ యాదయ్య ఇంటి నుండి గోపగాని ఆంజనేయులు ఇంటి వరకు 7.మందడి వీరారెడ్డి ఇంటి నుండి సామ దామోదర్ రెడ్డిఇంటి వరకు 8.చీమల విజయ ఇంటి నుండి మెడుదల రాజలింగం ఇంటి వరకు 9.తోకల ఆంజనేయులు ఇంటి నుండి చీమల విజయ ఇంటి వరకు 10.ఆర్ అండ్ బి రోడ్డు నుండి బొబ్బల ఉపేంద్ర ఇంటి వరకు 11.ఆర్ అండ్ బి రోడ్డు నుండి కళ్లెం భీష్మారెడ్డి ఇంటి వరకు 12.ఆర్ అండ్ బి రోడ్ నుండి అచ్చమ్మ ఇంటి వరకు 13.ఆర్ అండ్ బి రోడ్ నుండి గోడపర్తి నాగరాజు ఇంటి వరకు 14. వలబోజు బిక్షపతి ఇంటి నుండి వరుస పుల్లమ్మ ఇంటి వరకు 15.ఆర్ అండ్ బి రోడ్డు నుండి కొమ్ము బాలమల్లు ఇంటి వరకు నూతన సీసీ రోడ్లను పోయడం జరిగింది.

ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో రామచంద్రపురం గ్రామపంచాయతీలో 60 లక్షల నిధులతో మట్టి రోడ్లను సిసి రోడ్లుగా మార్చుకోవడం జరిగింది. గత ఎమ్మెల్యేల కాలంలో రామచంద్రపురం గ్రామపంచాయతీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తీరుగా ఉందని గ్రామ ప్రజలు మన్యం న్యూస్ కి తెలియజేశారు.రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో 60 లక్షల రూపాయల వ్యయంతో 15 మట్టి రోడ్లను సిసి రోడ్లుగా రేగా కాంతారావు చొరవతో మార్చుకోవడం జరిగిందని ప్రజలు తెలియజేశారు.గతంలో ఆ మట్టి రోడ్లపై వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు తెలియజేశారు.గత ఎమ్మెల్యేల కాలంలో సిసి రోడ్లు గురించి అడగగా చూద్దాంలే చేద్దాంలే అన్నట్లు వ్యవహరించారని కానీ రేగా కాంతారావుని అడగగా వారు స్పందించి 60 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని వారు తెలియజేశారు.అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి నూతన భవనం కొరకు 20 లక్షలు కేటాయించిన ప్రభుత్వ విప్ రేగాకి మా గ్రామ పంచాయితీ అభివృద్ధికి పాటుపడుతున్న రేగకాంతరావుకి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !