ఆ రహదారి పై ప్రయాణం ప్రాణభయం
*చర్ల నుంచి భద్రాచలం ప్రధాన రహదారి పై పలు చోట్ల గుంతలు
*ఇసుక లారీల అధిక లోడుతో రోడ్డు పోయే……
ఇబ్బందులు పడుతున్న వాహన దారులు,ప్రజలు
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం నుంచి ప్రధాన రహదారి అయినచర్ల నుండి భద్రాచలం రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడంతో ప్రయాణికులు ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. వాహనంపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమాత్రం ఆదమరిచిన అనంతలోకాలకి వెళ్లే పరిస్థితులు దాపురించాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ప్రత్యేక వైద్యం కొరకు భద్రాచలం వెళ్ళవలసి వస్తుంది. ఈ క్రమంలో అత్యవసర ప్రయాణం చేయుట కొరకు ప్రయాణం కొనసాగించగా పలుచోట్లలో రోడ్లు పై గుంతలు వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు పడడానికి కారణంగా ఇసుక లారీలు అధిక లోడుతో తిరుగుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నాయి.ఇదివరకు ఈ లారీలన్నీ వెంకటాపురం రోడ్డును ఆశ్రయించి ఆ రోడ్డును పూర్తిగా పాడైపోయి వెళ్ళలేని పరిస్థితులు ఉండడంతో భద్రాచలం వైపు రోడ్డు కూడా పూర్తిగా నాశనం చేస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. మండలంలోని కలివేరు గ్రామంలో నడి రోడ్డు పై ప్రధాన రహదారి కోతకు గురై, రెండు వైపులా పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణిస్తున్నారు. గతఏడాది ( భారీవర్షాలకు ఈ రోడ్డు కోతకు గురైంది. ఏడాది “కావస్తున్నా సంబంధిత ఆర్అండ్ బీ శాఖ అధికారులుపట్టించుకోకపోవడం విశేషం. ఇంతప్రమాదకరంగా ఉన్న రహదారికి కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఈవిషయమై గ్రామస్థులు అనేకసార్లు అధికారులకు విన్నవించినా ఫలితంలేదు ఈ రహదారి మీదుగా అటు వెంకటాపురం ఇటు భద్రాచలం వెళ్ళు వారు నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రహదారిలో కొత్తగా ప్రయాణించేవారు ఆదమరిస్తే ఇంతేసంగతులు కావున సంబంధిత అధికారుల ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు.
ఆధికారులు దృష్టి సారించాలి
నా పేరు వానరాశి వంశీ, మాది కలివేరు గ్రామం, చర్ల మండలం. మా ఊరు నుంచి భద్రాచలం ప్రయాణించడానికి రోడ్లపై గుంతలు పడటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఇసుక లారీలు వలన రోడ్లన్నీ పూర్తిగా పాడైపోతున్నాయి. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రోడ్లపై గుంతలను ప్రత్యామ్నాయంగా బాగు చేయవలసిందిగా కోరుతున్నాను.