UPDATES  

 మున్సిపాలిటీలో నిరంతరాయంగా పారిశుధ్య పనులు జరగాలి: కలెక్టర్ ప్రియాంక

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రతి మున్సిపాల్టీలో నిరంతరాయంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు మోడల్గా రెండు వార్డులను
ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి
కార్యాలయపు మిని సమావేశపు హాలులో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, హరితహారం, సమీకృత మార్కెట్లు
నిర్మాణం, వైకుంఠదామాలు, టిఎస్బిపాస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పట్టణ ప్రగతి, సియం హామీలు, స్వచ్ఛసర్వేక్షన్
అర్బన్, ఇంటిపన్నులు వసూళ్లు, మరణ ధృవీకరణ పత్రాలు జారీ, మెప్మా తదితర అంశాలపై సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు ప్రతి మున్సిపాల్టీలో
రెండు వార్డులను మోడల్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. మురుగునీటి నిల్వలు పేరుకుపోయిన
ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ వేయాలని చెప్పారు. దోమలు వ్యాప్తి జరుగకుండా విస్తృతంగా
ఫాగింగ్ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డిఆర్సిసి కేంద్రాల్లో పొడి వ్యర్థాలు విక్రయాలు చేపట్టాలని చెప్పారు.
స్వచ్చ వాహనాలు నిర్వహణతీరును పరిశీలించిన కలెక్టర్ మరమ్మత్తులకు గురైన వాహనాలకు మరమ్మత్తులు నిర్వహించి
వినియోగంలోకి తేవాలని చెప్పారు. హరితహారంలో నిర్దేశించిన మేర మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క
సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. వారం రోజుల్లో హరితహారంలో
కేటాయించిన లక్ష్యం మేర మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. ఇంటిపన్నులు వసూళ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. మున్సిపాల్టీలలో జరుగుతున్న
పనుల్లో ప్రగతి రావాలని, నత్తనడకన జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, మున్సిపల్ ప్రత్యేక అధికారులు అర్జున్, పురందర్, అలీం, మున్సిపల్ కమిషనర్లు రఘు, స్వామి,
కుమారస్వామి, ఉమామహేశ్వరావు, ప్రజారోగ్య ఈఈ రంజిత్, డిఈ శ్రీనివాస్, డిఈలు, ఏఈలు, టిపిఓలు తదితరులు
పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !