మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
దివంగత మాజీ మంత్రి కొత్తగూడెం అభివృద్ధి ప్రదాత కోనేరు నాగేశ్వరరావు 78వ జయంతి వేడుకలను బుధవారం కొత్తగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జి పక్కనున్న కోనేరు నాగేశ్వరరావు విగ్రహానికి కోనేరు పూర్ణచంద్రరావు, కోనేరు సత్యనారాయణ (చిన్ని) పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు కోనేరు నాగేశ్వరరావు అగ్రవాల్ స్మార్ట్ శీను ఆవాల శ్రీను రవి గౌడ్ మైనార్టీ నాయకులు ఆఫీస్ బాయ్ స్టీవెన్ లాజరస్ హరిహరన్ యాదవ్ జోగు ప్రదీప్ ప్రభాకర్ గుమలాపురం సత్యనారాయణ కిరణ్ మధుర బస్తి సాయి బుడగం మల్లయ్య అల్లి వినయ్ వడ్డేపల్లి జాను హరీష్ ఉదయ్ కుమార్ రహీం జానీ తదితరులు పాల్గొన్నారు.