UPDATES  

 వేజ్ బోర్డు ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలి * సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ఏరియర్స్ ను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
బుధవారం శేషగిరి భవన్ లో జరిగిన యూనియన్ కార్పొరేట్ బ్రాంచ్ ఆఫీసు బేయరెర్లు పిట్ కార్యదర్శుల సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, వంగ వెంకట్ మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు 23 నెలల అరియర్స్ ను కోల్ ఇండియాలో సింగరేణిలో చెల్లించాలని సూచిస్తూ సర్క్యులర్ జారీచేసినప్పటికి సింగరేణి యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడంపట్ల వారు తప్పు పట్టారు. కోల్ ఇండియాలో అట్టి 23 నెలల అరియర్స్ ను సెప్టెంబర్ 1న చెల్లించుటకు ఏర్పాట్లు చేస్తున్నారని కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. దానికి కారణాలు తెలియజేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల కస్తార్జితాన్ని అప్పనంగా ఇతరులకు బదలాయించడంలో చూపిన శ్రద్ధ కార్మికులపై లేకపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఈ అరియర్స్ మొత్తాన్ని వొకే సారి పొందినచో వాటిని సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉందని సింగరేణి యాజమాన్యం కూడా కోల్ ఇండియా లో మాదిరిగా 23 నెలల అరియర్స్ ను సెప్టెంబర్ లో చెల్లించే ఆగష్టు జీతంతో కలిపి చెల్లించాలని లేని యెడల సింగరేణి వ్యాప్తంగా ఆందోళనకు ఉపక్రమిస్తామని శేషయ్య వెంకట్ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, సహాయ కార్యదర్శి ఎస్. రాము, టి. నాగయ్య, పి.వి. సుబ్బరావు. సుధీర్, రంశంకర్, రవీందర్, ఏం. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !