నా గెలుపు భద్రాచలం అభివృద్ధి కి మలుపు
*అడగకుండానే భద్రాచలం అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
* కలెక్షన్ కింగ్ గా మారింది ఎవరు ప్రజలే గ్రహించాలి
.. డాక్టర్ తెల్లం వెంకట్రావు..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 30:: భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అడగకుండానే వరాల జల్లు కురిపించాడని భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
నియోజవర్గ అభివృద్ధి కొరకు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. బుధవారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కి బహుమతిగా మీరంతా సమిష్టిగా పనిచేసిన నన్ను గెలిపించాలని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తెలియజేస్తూ వారిని చైతన్యం చేసి మన నియోజకవర్గ అభివృద్ధికి వెనుకబాటు కారణాలు వారికి తెలిసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు కారు గుర్తుపై ఓట్లు వేసే విధంగా ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని, మండల వాసిని అయిన నన్ను ఈ మండలంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కనితిరాముడు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ, పార్టీ అధికార ప్రతినిధి జానీపాషా, ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, సర్పంచులు మట్ట శివాజీ, సోడి జ్యోతి, కారం జయ, సుమిత్ర, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు భీమరాజు, సొసైటీ డైరెక్టర్ పూర్ణయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, గంగరాజు, జయసింహ, తదితరులు పాల్గొన్నారు.