మన్యం న్యూస్ గుండాల: మూలమలుపు గమనించక వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టడంతో వ్యక్తి తీవ్ర గాయాలైన సంఘటన గుండాల మండలంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. కాచనపల్లి అడవి నుండి తోగు వెళ్లే మార్గమధ్యలో అశోక లేలాండ్ వాహనం అదుపు తప్పి ఫల్టికొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కైకలూరు గ్రామానికి చెందిన అశోక్ తన లేలాండ్ వాహనంలో కాలేశ్వరంలో చేప పిల్లలను దిగుమతి చేసి తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయాల పాలైన వ్యక్తిని ఆళ్లపల్లి పోలీసులు 108 వాహనం ద్వారా కొత్తగూడెం తరలించి చికిత్స అందిస్తున్నారు. మూలమలుపును గమనించకపోవడంతోనే ప్రమాదానికి కారణంగా తెలియ వచ్చింది.