ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత మామిడి హారిక
అభినందించిన గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి
మన్యం న్యూస్ ,బూర్గంపాడు(భద్రాచలం):
ఈనెల 26, 27 తేదీలలో బెంగళూరులో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో కర్ర సాము పోటీలలో బంగారు పతకం సాధించిన మామిడి హారికను గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి సాలువాతో సన్మానించి అభినందించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని రాజుపేట కాలనీలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న మామిడి వీరభద్రం విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె అయినటువంటి హారిక ఇటీవల డిగ్రీ పూర్తి చేసి BLIS( లైబ్రరీ కంప్యూటర్ సైన్స్) కోర్సును అభ్యసిస్తూనే, ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమవుతూనే, కర్ర సాము పోటీలలో కూడా, గతంలో ఎన్నోసార్లు పథకాలు సాధించి ఈసారి బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. ఈనెల 26 27 తేదీలలో బెంగళూరులో జరిగిన కర్ర సామ పోటీలలో 8 దేశాలు( ఇండియా,శ్రీలంక,నేపాల్,భూటాన్, బంగ్లాదేశ్, సుడాన్, ఇదియోపియా, గణ ) తలపడగా ఇండియా తరపున బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ గెలుపొందిన మామిడి హారికను గుండాల ఎంపీటీసీ వారి మిత్రులు అయినటువంటి గాలి రామ్మోహన్ రావు ( జాతీయస్థాయి బంగారు పతక విజేత ) ఇద్దరూ అభినందించడం జరిగింది. ఈ గెలుపొందిన హారిక ను ఉద్దేశించి గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ,ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా, శారీరక దృఢత్వాన్ని కూడా పెంపొందించడమే కాకుండా, ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి వారి యొక్క జాబ్ కి సంబంధించి అప్లై చేసినప్పుడు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కంటే కూడా స్పోర్ట్స్ కోట ద్వారా వీరికే జాబ్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ రోజుల్లో మహిళలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయపడే ఈ రోజుల్లో, ఒక మంచి క్రీడను నేర్చుకొని, దానిలో మంచి ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్థాయిలో బంగారు పథకాన్ని సాధించిన, మామిడి హారికను అభినందించడంతోపాటు, ఈ విజయానికి ఎక్కువ కారణమైనటువంటి వారి తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతగానో ఉందని ఈ సందర్భంగా తెలియజేసినారు.