UPDATES  

 మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మహమ్మద్ నగర్ గ్రామానికి నిత్యవసర సరుకులు అందజేత…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మహమ్మద్ నగర్ గ్రామానికి నిత్యవసర సరుకులు అందజేత…

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు జారె ఆదినారాయణ…

మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 30 : మండల పరిధిలో గల తిప్పనపల్లి గ్రామపంచాయతీ మహమ్మద్ నగర్ గత కొంతకాలంగా విష జ్వరాలతో బాధపడుతూ నిరుపేద గ్రామమైన ముస్లిం కుటుంబాలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం నిత్యవసర సరుకులను నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తిప్పనపల్లి గ్రామపంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని, గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ ఎల్లవేళలా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకుల్ల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సారేపల్లి శేఖర్,మాలోత్ భోజ్య నాయక్, దారావత్ రామారావు, కేశబోయిన నరసింహారావు,బొర్రా సురేష్, సర్ధార్, చాపలమడుగు ప్రసాద్, ఆళ్లకుంట రాందాస్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !