మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ పండుగ సంబరాలు
ఎమ్మెల్యే రేగాకు రాఖీ కట్టిఆశీర్వదించిన సోదరీమణులు
మన్యం న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పర్వదినం సందర్భంగా సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కి పలువురు మహిళలు రాఖీ కట్టారు. ఎమ్మెల్యే రేగా కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నిండైన మనసుతో సోదరీమణులు ఆశీర్వదించారు. అనంతరం మిఠాయిలు తినిపించారు .అనంతరంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.