మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని
కొత్తగూడెం షీ టీమ్ ఎస్ఐ పి.రమాదేవి అన్నారు. గురువారం షీ టీం పోలీస్ స్టేషన్లో
రక్షాబంధన్ వేడుకలు సందడిగా జరిగాయి. అనంతరం ఆర్ ఎస్ ఐ సుమంత్ కి ఎస్సై పి.రమాదేవి రాఖీ కట్టి మాట్లాడారు. తాను కొత్తగూడెం వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుందని తనకు తోడబుట్టిన సోదరులు లేరన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత తన తమ్ముడు సుమంత్ పరిచయం అయ్యాడని తెలిపారు. తమ్ముడు పరిచయమైన తర్వాత సొంత సోదరుడు లేడనే లోటు తీరిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం అని తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రేమనుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహల్లో జరుపుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.