మన్యం న్యూస్ మణుగూరు సెప్టెంబర్ 1
ముంబై ప్రియదర్శిని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో మణుగూరు ఎక్స్లెంట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న జక్కుల యామిని,మాంటెస్సోరి స్కూల్ పదవ తరగతి విద్యార్థి చదువుతున్న మండ పల్లవి స్పారింగ్,కటా విభాగాలలో మూడు బంగారు పథకాలు,ఒక వెండి పథకాన్ని సాధించడం జరిగింది.ఈ సందర్భంగా వీరిని మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఘనంగా సన్మానించారు.కరాటే మాస్టర్ కాసిమల్లా పద్మ బ్లాక్ బెల్ట్ ను గోల్డ్ మెడల్ సాధించడం పట్ల వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రసాద్,మండల యువజన అధ్యక్షులు హర్షనాయుడు తదితరులు పాల్గొన్నారు.