మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 01::
సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జాక్టోకో ఛైర్మెన్, ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మారాయి గూడెం యుపిఎస్ఎస్ పాఠశాలలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇప్పటికే అనేక రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కల్లూరి బుర్రయ్య, సీతారామయ్య, హిందులత, తెల్లం చిన్నక్క, పార్వతి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.