మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం ఏరియాలో ఏజీఎం(పర్సనల్)గా విధులు నిర్వహిస్తున్న పి.సామ్యూల్ సుధాకర్ సూపర్ బజార్ ఎండిగా పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా టిబిజికేయస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఇంచార్జ్ ఏజిఎం(పర్సనల్) కిరణ్ బాబు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సుధాకర్, రీజినల్ సెక్రెటరీ కూసన వీరభద్రం, ఫిట్ కార్యదర్శులు చిలక రాజయ్య, చెరిపల్లి నాగరాజు, ఎం.డి సత్తార్ పాష, శనిగరపు కుమార్, సుద్దాల నర్సింగం, కే.నటరాజ్, మధుసూదనాచారి, గద్దె మురళి కృష్ణ, బాలేరు, సంజయ్, వినీల్, పొదిల శ్రీనివాసరావు, మోహన్ రెడ్డి, విప్లవ్, ట్రెజరర్, గోపు కుమార్ స్వామి, రాజేశ్వరరావు, కేశవరెడ్డి, నిమ్మల రాజేశ్వరరావు, భీముడు, నాయకులు రవీందర్, గజ్జి శ్రీనివాస్, వెజ్జాల శ్రీనివాస్ ఎస్.కె.గౌస్, కొమురయ్య, అమృత రావు, మేకల గిరిబాబు, దుర్గప్రసాద్, బి.గోపాల్, కొప్పుల కుమార్, భాను కమల్, అనిల్, రమాకాంత్, యాకూబ్ సాబ్, సాగర్, వాల్సన్, ఉమర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.