UPDATES  

 సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

* సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

* కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ షావలి

మన్యం న్యూస్,ఇల్లందు: ఐఎఫ్టీయు అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్రసదస్సు ఈ నెల 10న ఇల్లందులో నిర్వహించడం జరుగుతుందని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని స్థానిక చండ్ర కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో శుక్రవారం సింగరేణి కాంటాక్ట్ కార్మికుల ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రఅధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీప్రకారం సింగరేణిలో వున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా ఇల్లందు చండ్ర కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఈ నెల10 న జరుగు రాష్ట్రసదస్సును జయప్రదం చేయాలని సింగరేణిలో ఉన్న నలుమూలల నుండి కాంట్రాక్టు కార్మికులు సదస్సుకు తరలిరావచ్చి భవిష్యత్ ఉద్యమకర్తవ్యాలను రూపొందించుకునేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు, వెంకన్న, మంజు, సుమిత్ర, పద్మ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !