మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని విద్యావనరుల కేంద్రంలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రమును అందజేశారు. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వము తమ సమస్యలను పరిష్కరించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు.