UPDATES  

 సీఎం సహయనిధి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుంది టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ ,రైతు సమితి అధ్యక్షులు వీరస్వామి

మన్యం న్యూస్ గుండాల: సీఎం సహాయనిధి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గడ్డం రవి కుమార్తె గడ్డం సంధ్య కు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కును వారు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంజూరు చేయిస్తున్నారని అన్నారు. గతంలో గుండాల మండలంలో సీఎం సహాయ నిధి అంటేనే తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు ప్రభుత్వ విప్ రేగా చొరవతో వందలాది చెక్కులను ఇప్పటికే మంజూరు చేయించి పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు లాలయ్య, ప్రకాష్, ఆగయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !