మన్యం న్యూస్,కరకగూడెం: కరకగూడెం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ తిప్పని శ్రీను కుమార్తె స్పందన(17) బుధవారం డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో మృతురాలు స్పందన నివాసానికి వెళ్లి బాధిత పత్రిక విలేఖరి తిప్పని శ్రీను ను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సైతం దైర్యంగా ఉండాలని సూచించారు.ఎమ్మెల్యే రేగా వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ మండల నాయకుల తదితరులు పాల్గొన్నారు.
