మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన క్రమబద్దీకరణ హామీ అమలు కోసం ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఏకం కావాలని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి క్రమబద్దీకరణ హామీని సాధించుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గొనె మని జిల్లా నాయకురాలు రెడ్డి అరుణ పిలుపునిచ్చారు. క్రమబద్దీకరణ డిమాండుపై వైద్య శాఖలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మె సందర్బంగా కలెక్టరేట్ ధర్నాచౌకులో ఏర్పాటు చేసిన నిరసన శిభిరాన్ని సందర్శించి సమ్మె ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లపట్ల నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. త్యక్షణమే రెండో ఏఎన్ఎంలతో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ లేని పక్షంలో ఉద్యమాల ఉదృతిని పెంచుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎన్ఏంల యూనియన్ జిల్లా అధ్యక్షులు సజ్జు బేగం, కార్యదర్శి ప్రియాంక, నాయకులు అరుణ, పార్వతి, సుమలత, పుష్ప, రాములమ్మ, సంధ్యారాణి, విరమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు.