మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధి దుగినేపల్లి గ్రామంలో మొదటిసారిగా “చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ” సహకారంతో దుగినేపల్లి యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ బయ్యారం సిఐ శివప్రసాద్, ఎస్సై నాగుల మీరా ఖాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుగినేపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఒకేసారి రెండు బ్లడ్ బ్యాంకులు ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రిలోనూ గర్భిణీ స్త్రీల కొరకు, భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ రక్తహీనత పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ శివప్రసాద్ మాట్లాడుతూ, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు కార్యక్రమాలు మరువలేని అని, మారుమూల గ్రామాలలో నివసిస్తున్న పేద ప్రజలకు రక్తదాన అవగాహన సదస్సు జరిపించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మందికి ఎంతోమందికి ఆదర్శం అని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్, తేజ, బత్తుల నందకుమార్, జ్వాలా యూత్ అధ్యక్షుడు నరేష్, దుగేనేపల్లి యువత, భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, ఏటూర్ నాగారం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





