గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన గంగపుత్రుల సంఘం
మన్యం న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటీవల సీఎం కేసీఆర్ ₹ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ₹శాలువాతో సత్కరించడం జరిగింది.అనంతరం వారి సమక్షంలో గంగపుత్ర సంఘం నూతన కమిటీని వారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీగా ఏర్పడిన కార్యవర్గానికి వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగేనూతన కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్
రేగా కాంతారావు సన్మానించడం జరిగింది.గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ప్రభుత్వం తరఫున తను అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు.





