UPDATES  

 బేతాళపాడులో శ్రావణమాస సందడి

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 03, మండల పరిధిలోని బేతాళపాడు గ్రామంలో శ్రావణమాస ఆదివారం సందర్భంగా గ్రామంలోని మహిళలంతా గ్రామ దేవత లైన బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి కి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో ఆ గ్రామంలో శ్రావణమాస సందడి నెలకొంది. గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలతో పాటు, భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పాడి పంటలు, పశు సంపద వృద్ధితోపాటు, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని సిరి సంపదలు కలగజేయాలని దేవతలను వేడుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !