హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ కుట్రల నుంచి సింగరేణిని సీఎం కేసీఆర్ తప్పించారని అన్నారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి సింగరేణి సంస్థను కాపాడారని తెలిపారు.





